భద్రాచలం ఆలయ ఈవో బదిలీని నిలిపివేయాలి
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవిని ప్రభుత్వం కీసర ఆర్డీవోగా బదిలీ చేసిందని, వెంటనే ఆమె బదిలీని నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ సెంటర్లో ప్ల కార్డులు చేబూని మంగళవారం నిరసన చేపట్టారు.
భద్రాచలం, ఫిబ్రవరి 13 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవిని ప్రభుత్వం కీసర ఆర్డీవోగా బదిలీ చేసిందని, వెంటనే ఆమె బదిలీని నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ సెంటర్లో ప్ల కార్డులు చేబూని మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు ఆకోజు సునీల్ మాట్లాడుతూ సరిగ్గా ఏడాది క్రితం ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టిన రమాదేవి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. పురుషోత్తపట్నంలో ఆలయానికి సంబంధించిన వేలాది ఎకరాల భూముల్లో శాశ్వత కట్టడాలను తొలగించి కాపాడారన్నారు.
అటువంటి అధికారిని బదిలీ చేయకుండా ఇక్కడే కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు భీమవరపు వెంకటరెడ్డి, కోలా రాజు, పామరాజు తిరుమలరావు, మల్లెల లోకేశ్, దాసరి శేఖర్, రామోజు రాముడు తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈవో రమాదేవి బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఈవో రమాదేవి బదిలీ అర్థరహితమని, ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాతే పాలన గాడిలో పడిందని పట్టణ ప్రముఖులు గాదె మాధవరెడ్డి, ఎస్కే అజీమ్ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

