
ఖమ్మం :స్వాతంత్ర దినోత్సం వేడకులలో ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా అవార్డు పొందిన టీఆర్ఎస్ కేవీ అధ్యక్షురాలు, టీచర్ సునీతను బుధవారం ఘనంగా సన్మానించారు. నగరంలోని సంఘం కార్యాలయంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మాటూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు, టీచర్లు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువతో సత్కరించారు. అనంతరం మాటూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంగన్ వాడీకేంద్రాలకు వచ్చే లబ్దిదారులు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు.
కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. టీచర్లు, హెల్పర్ల శ్రమను గుర్తించి గౌరవ వేతనాలు మరోమారు పెంచిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పారిజాతం, నాగమణి, కళ్యాణీ, ఝాన్సీ, రెహానా, శోభ, లక్ష్మీ, రేవతి తదితరులు పాల్గొన్నారు.