LHB coach | మధిర :ఎల్హెచ్బి కోచ్‌ల ప్రవేశంతో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు సాఫీగా సురక్షితమైన, మరింత ఆనందదాయకమైన ప్రయాణాన్ని అనుభవించవచ్చని సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ -సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి మధిర, ఖమ్మం, డోర్నకల్ మీదిగా రాకపోకలు సాగించే శాతవాహన ఎక్స్ ప్రెస్ రైళ్లలో (నం.12713/12714)లో ప్రయాణించే వారికి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్‌గా పాపులర్ అయిన ఈ రైళ్లలో ప్రయాణించే వారి భద్రత, సౌకర్యం కోసం ఓ కీలక మార్పు చేశారు.
విజయవాడ-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రస్తుతం ఉన్న ICF కోచ్‌ల స్థానంలో ఆధునిక లింకే హాఫ్మన్ బుష్ (LHB) కోచ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణీకులకు సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని ఇవ్వడానికి ఇలా కోచ్ లను మారుస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కోచ్ ల మార్పు వల్ల ప్రయాణికులకు కలిగే సౌకర్యాలను కూడా వివరించారు.
ఈ అధునాతన LHB కోచ్ ల వల్ల ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవం లభిస్తుందన్నారు. మెరుగైన కుషనింగ్, ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్‌లు, విశాలమైన విండోలతో సమర్థతాపరంగా సీట్లను రూపొందించినట్లు తెలిపారు. అలాగే LHB కోచ్‌ల మెరుగైన స్థిరత్వంతో రైలు అధిక వేగంతో ప్రయాణించే అవకాశం లభించింది.
Power Demand | తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. మండుతున్న ఎండలే కారణం..!
KTR | హిమాయత్‌నగర్ చౌరస్తాలో గులాబీ జెండా ఎగురవేసిన కేటీఆర్