కోటపల్లి, నవంబర్ 9 : 2023, జూన్ 9.. మంచిర్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న బీసీ బంధు పథకం ఆవిష్కృతం. బీసీ కులవృత్తులను ఆదుకునేందుకు, వారికి చేయూత కల్పించి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించిన మహోన్నత కార్యక్రమం. ఈ పథకం ప్రథమ లబ్ధిదారుడు, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెలమపల్లి గ్రామానికి చెందిన కుందారపు మురళి… సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కు అందుకున్నా డు. ఈ లబ్ధిదారుడు కుమ్మరి వృత్తి చేసుకుంటుండగా, కేసీఆర్ ప్రభుత్వం అందించిన సాయంతో సంతోషంగా కుల వృత్తి చే సుకుంటూ ముందుకు సాగుతున్నాడు. బీసీ బంధు పథకం ద్వారా రాష్ట్రంలోనే ప్రథమ లబ్ధిదారుడైన మురళిని ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా, పథకం వల్ల కలుగుతున్న లబ్ధి, ప్రభుత్వం బీసీల కోసం చేస్తున్న కృషిని వివరించాడు.
మురళీ : తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన బీసీ బంధు పథకం అద్భుతం. గతంలో ఎంతో మంది పాలకులు పాలించినా, ఏ ఒక్కరు కూడా బీసీల గురించి ఆలోచించలేదు. వారికి ఏం చేయాలో సోయి కూడా ఉండేది కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి మా పేద బీసీల సంక్షేమం కోసం ఆలోచించి, కుల వృత్తులు అంతరించిపోకుండా ఉండేందుకు బీసీ బంధును రూపొందించిండు. మా బంధువు అయిండు. బీసీ కులస్తులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష సాయాన్ని అందచేసి, అండగా నిలిచిండు.
మురళి : గతంలో ఏ ప్రభుత్వాలూ బీసీలను పట్టించుకోలేదు. దీంతో కులవృత్తులపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బీసీలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. కులవృత్తులను ప్రోత్సహించడం, మాకు ఆర్థిక సాయం చేయడం చాలా ఆనందంగా ఉంది. సరారు అందిస్తున్న సాయం మా ఉపాధిని మెరుగుపర్చడానికి ఎంతో ఉపయోగపడుతున్నది.
మురళి : మాది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెలమపల్లి. కుమ్మరి వృత్తి చేసుకుంటున్న. నేను, భార్యతో కలిసి కుండలు, రంజన్లు, ఇతర మట్టి వస్తువులు తయారు చేస్తా. నాకు ముగ్గురు పిల్లలు. వారు చదువుకుంటున్నారు. శుభకార్యాలకు ఐరెండ్ల కుండలతో పాటు గృహప్రవేశాలకు ఉపయోగపడే కూరాడు కుండలు, మల్లన్న కుండలు, గరిగబుడ్డి, కోలు గడిమంత, మల్లన్న బోనాల కుండలతో పాటు కందులు, పెసర్లు వేయించే మంగుళం వంటివి తయారు చేస్తుంటాం. ప్రస్తుతం దీపావళి పండుగ ఉండడంతో ప్రమిదలు, కుండలు తయారు చేస్తున్నాం.
మురళి : తెలంగాణ ప్రభుత్వం నాకు బీసీ బంధు ద్వారా అందించిన సాయంతో నా ఉపాధి మెరుగైంది. ప్రభుత్వం అందించిన రూ.లక్ష సాయంతో విద్యుత్‌తో కండలు తయారు చేసే యంత్రాన్ని కొనుగోలు చేసిన. కుండలు తయారు చేసే యంత్రం లేకపోవడంతో పాత పద్ధతిలో కుండలు తయారు చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. పాత పద్ధతిలో రోజుకు 10 నుంచి 15 కుండలు చేస్తే కొత్త యంత్రం ద్వారా రోజుకు 30 నుంచి 50 వరకు కుండలు తయారు చేస్తున్నా. ఇలా తయారు చేసిన కుండలను ఇతర ప్రాంతాలకు తరలించి, ఉపాది పొందుతున్నా. నూతన పద్ధతి ద్వారా కుండలు తయారు చేస్తుండడంతో నా వారసులు కూడా కుండల తయారీపై ఆసక్తి చూపుతున్నరు. దీంతో పాటు నా ఈ వృత్తి మరింత ఆధునికత సంపాదించుకోనున్నది.
మురళి : పాత పద్ధతి ద్వారా కుండలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విధానం ద్వారా కుండలు తక్కువ తయారయ్యేవి. దీని ద్వారా శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువ ఉండేది. ప్రభుత్వం అందించిన సాయం వల్ల ఆధునిక పద్ధతులతో నా కులవృత్తికి నూతన పోకడలోకి తీసుకెళ్లడంతో తక్కువ శ్రమంతో రోజుకు 200 నుంచి 300 రూపాయల వరకు ఉపాధి పొందుతున్నా. ఉదయం, సాయంత్రం ఈ పని చేస్తూ మధ్యాహ్నం వ్యవసాయ పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నా. అడగకుండానే బీసీ బంధు ద్వారా నాకు సాయం అందచేసి, నా కుల వృత్తికి జీవం పోసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మా ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు రుణపడి ఉంటా.