తల్లాడ :మహిళలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు. మండల పరిధిలోని అన్నారుగూడెం, బిల్లుపాడు, వెంగన్నపేట, మిట్టపల్లి, కలకొడిమ గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సముచితస్థానం కల్పిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్లాల్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దిరిశాల దాసురావు, తూము వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.