చుంచుపల్లి, మే 07 : యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ (బాదావత్ తండా)లో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్ తండా యువతకు క్రికెట్ కిట్‌ను అందజేశారు. యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరిచి ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు జట్టు భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూక్యా సురేష్, రఘు, నికోలస్, రాము పాల్గొన్నారు.