రామవరం, సెప్టెంబర్ 03 : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం పంజాబ్ గడ్డకు చెందిన మైలారం జై కుమార్ (23) బుధవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేండ్ల క్రితం జై కుమార్ హైదరాబాద్కు చెందిన అఖిల భార్గవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల పాటు ఖమ్మంలో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఏడాది క్రితం హైదరాబాద్లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన అఖిల భార్గవి జై కుమార్ పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. రెండు నెలల క్రితం కోర్టుకు వచ్చి తనకు జై కుమార్ వద్దని చెప్పింది. దీంతో మనస్థాపానికి గురైన జై కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి మైలారం ప్రసాద్ తెలిపాడు. ఈ మేరకు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.