‘యోగా నిత్య జీవితంలో భాగం కావాలి’
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చుంచుపల్లి మండలంలోని వివిధ పాఠశాలలో శనివారం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ గౌతమ్‌పూర్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక యోగా..
చుంచుపల్లి, జూన్ 20 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చుంచుపల్లి మండలంలోని వివిధ పాఠశాలలో శనివారం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ గౌతమ్‌పూర్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కల్తీ రాము విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీవన విధానమని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ యోగా చేయాలని, దానిని తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో వివిధ యోగాసనాలు చేయించి వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఏకాగ్రత పెరిగి చదువుపై మరింత దృష్టి సారించగలరని తెలిపారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

