ఇల్లెందు, అక్టోబర్ 04 : ఇల్లెందు సింగరేణి ఏరియాలో రీజినల్ స్థాయి క్రీడా పోటీలను ఏరియా జీఎం కృష్ణయ్య శనివారం ప్రారంభించారు. ఇల్లెందు సింగరేణి గ్రౌండ్ లో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ 2025 -26 కు గాను ఇల్లెందు ఏరియా ఆధ్వర్యంలో రీజనల్ స్థాయి మణుగూరు, ఇల్లెందు ఏరియా క్రీడా పోటీలను జిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఒత్తిడి తట్టుకునే విధానం పెంపొందించుకోవచ్చన్నారు. ఉద్యోగులు తమ నిత్య జీవిత విధుల్లో భాగంగా ప్రతిరోజు 30 నిమిషాల పాటు తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.
క్రీడల వల్ల క్రమశిక్షణ ఏర్పడుతుందన్నారు. ప్రతి సంవత్సరం సింగరేణి సంస్థ ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా క్రీడా పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు. యువ ఉద్యోగాలు క్రీడలపై దృష్టి సారించి రాణించి ఇల్లెందు ఏరియాకి మంచి పేరు తీసుకురావాలని ఆకాక్షించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని కబడ్డీ, బాల్ బ్యాట్మెంటన్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జీఎం రామస్వామి, బోడ ప్రసాద్, జాన్ వెస్లీ, గుర్తింపు సంఘాల బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, వైస్ ప్రెసిడెంట్ జె.వెంకటేశ్వర్లు, దాట్ల శ్రీకాంత్, బోడ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.
Yellandu : ఇల్లెందు సింగరేణి ఏరియా రీజినల్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం