ఏరియా వర్క్‌షాప్‌లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన సదస్సు
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ముఖ్యంగా ఊపిరితిత్తుల, రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లలిత కుమారి అన్నారు. కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్‌షాప్‌లో శనివారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని..
రుద్రంపూర్, ఫిబ్రవరి 21: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ముఖ్యంగా ఊపిరితిత్తుల, రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లలిత కుమారి అన్నారు. కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్‌షాప్‌లో శనివారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన సదస్సు నిర్వహించారు. సింగరేణి ప్రధాన ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హెచ్.ఓ.డి జె.క్రిష్టఫర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణ, సమయానుకూల చికిత్స ప్రాముఖ్యతను తెలియజేయడం, బాధితులకు మానసిక–సామాజిక మద్దతు కల్పించడమేనని అన్నారు. జీవనశైలిలో మార్పులు, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, ప్లాస్టిక్ వినియోగం, మద్యపానం, ధూమపానం, వ్యాయామం లోపం, కాలుష్యం వంటి అంశాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నట్లు తెలిపారు.

ఏరియా వర్క్‌షాప్‌లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన సదస్సు
ముందస్తు నిర్ధారణ ద్వారా ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. మహిళలు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రుద్రంపూర్ డిస్పెన్సరీ మెడికల్ సూపరింటెండెంట్ ఎం.పరశురాములు మాట్లాడుతూ.. క్యాన్సర్‌పై అవగాహన జీవన రక్షణకు తొలి అడుగు. సమయానికి నిర్ధారణ, సరైన చికిత్స, ధైర్యం ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చు అని ఆమె పేర్కొన్నారు. అనంతరం వర్క్‌షాప్ ఉద్యోగులు అడిగిన పలు సందేహాలకు వైద్యులు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఈ టి.అనిల్, ఐఎన్టీయూసీ ఫిట్ కార్యదర్శి, ఎండి సత్తార్ పాషా, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి ఎం.మధుకృష్ణ, సూపర్వైజర్లు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, ఆల్ ట్రేడ్ అప్రెంటీసులు, డిఎల్ఆర్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

