రామవరం, ఆగస్టు 08 : బొగ్గు గ్రేడ్ లను పరిశీలించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) చీఫ్ విజిలెన్స్ అధికారి బాదావత్ వెంకన్న అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఆయన పర్యటించారు. సింగరేణి నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా కొత్తగూడెం ఏరియాను సందర్శించడంతో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు పూల మొక్క, శాలువాతో ఘనంగా స్వాగతించారు. కొత్తగూడెం ఏరియాలోని కిష్టారం ఓసి, జెవిఆర్ ఓ.సి, జెవిఆర్ సి.హెచ్.పి, కొత్తగూడెం జిఎం కార్యాలయం నందు వివిధ విభాగాధిపతులతో బాదావత్ వెంకన్న సమీక్ష నిర్వహించారు.
అనంతరం కిష్టారం ఓసీ, జేవిఆర్ఓసి ఉపరితల గనుల మ్యాపుల ద్వారా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్, సంబంధిత ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఉపరితల గనుల వివరాలను వివరించారు. నూతనంగా అనుమతులు వచ్చిన ప్రాజెక్టు వికే ఓ.సి ఉపరితల మైన్ వివరాలను, వాటి రికార్డులను వివరించారు. కిష్టారం ఓసీ, జెవిఆర్ ఓ.సిలను సందర్శించి వ్యూ పాయింట్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం కిష్టారం ఓసి & జేవిఆర్ ఓసిల నందు ప్లాంటేషన్ చేశారు. జెవిఆర్ సి.హెచ్.పి లోడింగ్ పాయింట్ ను సందర్శించి సి.హెచ్. పి నందు రైలు మార్గం ద్వారా జరుగుతున్న బొగ్గు రవాణా గురించి, సైలో బంకర్ నుండి దుమ్ము ధూళి వెలువడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు
ఈ కార్యక్రమంలో ఎస్ ఓటు జిఎం జి.వి. కోటిరెడ్డి, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు జేవిఆర్, ఓసి ఎన్.వి.ఆర్ ప్రహ్లాద్, కిష్టారం ఓసి ఎంవి.నరసింహారావు, జేవిఆర్ సి.హెచ్.పి డీజీఎం (ఈ&ఎం) కె.సోమశేఖర్, డీజీఎం (పర్సనల్) జి.వి.మోహన్ రావు, డీజీఎం (ఐఈడి) ఎన్.యోహాన్, కొత్తగూడెం ఏరియా ఇతర విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.
Ramavaram : అంకితభావంతో పనిచేసి సంస్థ పురోభివృద్ధిలో భాగస్తులవ్వాలి : చీఫ్ విజిలెన్స్ బాదావత్ వెంకన్న