Anganwadi Workers | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9 : కాంగ్రెస్ సర్కార్ అంగన్ వాడీలకు చుక్కలు చూపెడుతుంది. మినీ అంగన్వాడీలు మెయిన్ కేంద్రాలు ఐనప్పటికీ మినీ జీతాలతో సరిపెడుతున్నారు. దీంతో 11 నెలలుగా పనిభారంతో సతమతం అవుతున్నారు.
జిల్లాలో 626 మందిపై పనిభారం..
భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో 2060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి..ఇందులో 626 మినీ సెంటర్లు వుండగా గత ప్రభుత్వం మినీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేస్తూ ప్రతిపాదన చేసింది. ఆ సమయంలో ఎన్నికలు రావడంతో కొత్త సర్కార్ అప్ గ్రేడ్ జీఓ జారీ చేసింది. కానీ వారికి పాత జీతాలు ఇచ్చి సరిపెట్టింది. దీంతో అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేశారు.. అయినా ఫలితం లేకుండా పోయింది.
ఎంత కాలం చాకిరీ..
మినీ సెంటర్స్ లో ఆయాలు వుండరు… వాటిని మెయిన్ సెంటర్లుగా చేసి ఆయాలను నియమించకపోవడంతో రెండు పనులు చేయలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త జీతాలు ఇవ్వకపోతే మళ్లీ ఆందోళన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
CM Revanth Reddy | బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి : ఎంఎం గౌడ్
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రచ్చబండపై నిరాహారదీక్షకు దిగిన యువకుడు