– సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా
ఖమ్మం రూరల్, జనవరి 26 : ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా తెలిపారు. సోమవారం ఈ మేరకు ఎదులాపురం మున్సిపాలిటీలోని ముత్తగూడెంలో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జరగబోవు ఎన్నికల్లో సిపిఐ 15 వార్డుల్లో పోటీ చేయనుందన్నారు. కావునా సిపిఐ శ్రేణులు సమయత్తం కావాలని పిలుపునిచ్చారు. గెలుపు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆయా వార్డుల్లో సిపిఐ జెండా ఎగరేసేందుకు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.
అనంతరం విజయ అవకాశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పుచ్చకాయల కమలాకర్, మెడకంటి పెద్ద వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఉన్నం రంగారావు, చెరుకుపల్లి భాస్కర్, వెంపటి సురేందర్, పగిళ్ల వీరభద్రం, సిపిఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, సిపిఐ మున్సిపాలిటీ వార్డుల కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.