Ramavaram : సింగరేణి పురోభివృద్ధికి అంకితభావంతో పని చేయాలి : తిరుమలరావు
సింగరేణిలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి సంస్థ పురోభివృద్ధిలో భాగస్తులు అవ్వాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఈ & ఎం) ఎం.తిరుమలరావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియాలో ఆయన పర్యటించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేం రాజు పూల మొక్క అందజేసి శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతించారు.
రామవరం, సెప్టెంబర్ 20 : సింగరేణిలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి సంస్థ పురోభివృద్ధిలో భాగస్తులు అవ్వాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఈ & ఎం) ఎం.తిరుమలరావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియాలో ఆయన పర్యటించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేం రాజు పూల మొక్క అందజేసి శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల శాఖాధిపతులు, అధికారులు తమను పరిచయం చేసుకున్నారు. కొత్తగూడెం ఏరియాలోని కొత్తగూడెం జిఎం కార్యాలయం నందు డైరెక్టర్ (ఈ & ఎం), ఎం. తిరుమల రావు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియాలోని (ఈ & ఎం) విభాగంలో అధికారులు, సూపర్వైజర్లు ఎంతమంది పనిచేస్తున్నారు, ఇంకా ఎంతమంది వేకెన్సీ ఉందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జీఎం జి.వి.కోటి రెడ్డి, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, డీజీఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, డీజీఎం (ఐఈడి) ఎన్.యోహాన్, డిజిఎం(ఈ&ఎం) ఏరియా వర్క్ షాప్ జె.క్రిస్టోఫర్, కొత్తగూడెం ఏరియా ఇతర విభాగాల అధిపతులు, (ఈ&ఎం) అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

