రామవరం, ఏప్రిల్ 22 : సేవా గుణాన్ని అందరూ అలవర్చుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు. మైనింగ్ ఒకేషనల్ ట్రైనింగ్ కోర్సు కొత్తగూడెం నందు పనిచేస్తున్న సింగరేణి సిబ్బంది, ట్రైనింగ్‌కు వచ్చిన అభ్యర్థులంతా కలిసి రూ.10 వేలు జమ చేశారు. మంగళవారం ఈ నగదును జీఎం శాలెం రాజు చేతుల మీదుగా పాల్వంచలోని యువసేన అసోసియేటీస్ యువసేన చిల్డ్రన్ హోమ్ అండ్ స్పెషల్ నీడ్స్ స్కూల్ (పిల్లల) అనాధాశ్రమ నిర్వాహకులకు అందజేశారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ నగదు అందజేసిన ఎంవీటీసీ సిబ్బందికి, అధికారులకు అలాగే ట్రైనింగ్ సిబ్బందికి ప్రత్యేక అబినందనలు తెలిపారు. ఆపన్నులకు ఆర్థిక చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమములో కొత్తగూడెం ఏరియా ఎస్ఓ టు జిఎం జి.వి. కోటి రెడ్డి, ఎం.వి.టి.సి మేనేజర్ జి.లక్ష్మణ్, ఎం.వి.టి.సి అధికారి కలువల చంద్రశేఖర్, రవీందర్, యువసేన అనాధాశ్రమం సిబ్బంది పాల్గొన్నారు.