భద్రాద్రి కొత్తగూడెం. నవంబర్ 25 : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన దీక్షా దివస్ సన్నాహక సమాశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భద్రాద్రి జిల్లా స్థానిక ఎన్నికల్లో గులాబీమయం కాబోతుందని, అన్ని పంచాయతీలు కైవసం చేసుకోబోతుందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భద్రాద్రి జిల్లాలో ఐదు నియోజకవర్గాలతో పాటు అన్ని పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలు బీఆర్ఎస్ గెలవబోతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసి స్థానిక ఎన్నికలు జరుపుతుందన్నారు. రేవంత్ రెడ్డికి స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పుదన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. ఈ నెల 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో భారీ స్థాయిలో జరగబోతుందని, ఈ కార్యక్రమానికి ప్రతి మండలం నుండి 100 మంది కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా హాజరుకావాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెం నియోజకవర్గానికి ఎన్నికల ఇన్చార్జిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉండనున్నట్లు తెలిపారు. భద్రాద్రి జిల్లాలోని భద్రాచలంలో ఉప ఎన్నిక తప్పకుండా జరుగుతుందని ఆ ఎన్నికలో గులాబీ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడొద్దని, అన్ని మండలాల్లో మండల కమిటీలు, పట్టణ కమిటీలు వేయడం జరిగిందని, త్వరలో జిల్లా కమిటీ కూడా పూర్తిస్థాయిలో ఏర్పడబోతుందని తెలిపారు. సీనియర్ నాయకులకు ప్రతి సమావేశంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Bhadradri Kothagudem : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ఈ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, మెచ్చ నాగేశ్వరరావు, భద్రాచలం ఇన్చార్జి రామకృష్ణ, భద్రాచలం నాయకులు రావులపల్లి రాంప్రసాద్. ఇల్లెందు సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు దిండిగల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతా మహాలక్ష్మి, మాజీ జడ్పిటిసి వెంకటరెడ్డి, లక్ష్మిపల్లి మండలాధ్యక్షుడు పొట్టి వెంకటేశ్వర్లు, మణుగూరు మాజీ జడ్పీటీసీ పోసం నరసింహారావు, ఇల్లెందు, భద్రాచలం, అసరాపేట, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గం మండల కమిటీల సభ్యులు హాజరయ్యారు.

Bhadradri Kothagudem : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర