ఓటరు సమాచారం ఎన్యుమరేషన్ ఫారంలో సమగ్రంగా ఉండాలి : ఐటీడీఏ పీఓ రాహుల్
ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓ, సూపర్వైజర్లు ఓటర్ల సమాచారం ఎన్యుమరేషన్ ఫారంలో నింపేటప్పుడు ఓటర్లకు సంబంధించి సమాచారం సమగ్రంగా ఉండేలా పూరించాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు.
బూర్గంపహాడ్, జూలై 04 : ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓ, సూపర్వైజర్లు ఓటర్ల సమాచారం ఎన్యుమరేషన్ ఫారంలో నింపేటప్పుడు ఓటర్లకు సంబంధించి సమాచారం సమగ్రంగా ఉండేలా పూరించాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. శనివారం బూర్గంపహాడ్ రైతు వేదికలో బీఎల్ఓ, సూపర్వైజర్ల అవగాహన సదస్సులో వారికి ఆయన పలు సూచనలు చేశారు. 2002 ఓటరుకు సంబంధించి ఒక బాక్సు, 2002 ఓటులేని వారి కోసం మరో బాక్సు ఉంటుందని ఈ రెండు బాక్సులో ఒకదానిని పరిస్థితికి ఆధారంగా ఎంచుకుని ఎన్యుమరేషన్ ఫారం నింపాల్సి ఉంటుందని, ఇది ప్రజలకు అర్ధంకాక పోవడంతో వారికి బీఎల్ఓ, సూపర్వైజర్లు అవగాహన కల్పించి ఫారం తప్పులు లేకుండా నింపేలా చూడాలని సూచించారు. అర్హత కలిగిన ఓటరు ఓట్లు తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఫారంలో సూచించిన ప్రకారం అన్ని పత్రాలు ఓటరు దగ్గర పెట్టుకోవాలని, ఓటరు జాబితా సమగ్ర సవరణ పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పీవీటీజీ అధికారి గన్యానాయక్, తహశీల్దార్ కేఆర్కే ప్రసాద్, డీటీ సమ్మయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
MLA Raja Singh | ఆయన చెప్పింది నిజమే…తెలంగాణలో గుండాల రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తుంది : ఎమ్మెల్యే రాజాసింగ్
Yadagirigutta | యాదగిరిగుట్టలో ప్రారంభమైన కోటి పుష్పార్చన
మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం : వేల్పుల వేణు గోపాల్
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

