రామవరం, జూలై 28 : మావోయిస్టుల వారోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు సోమవారం కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే దారుల్లో, ప్రధాన రహదారుల్లో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ ప్రతాప్ మాట్లాడుతూ.. అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీల్లో ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.