‘ఉర్దూ మీడియం ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయాలి’
ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించనున్న ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఉర్దూ మీడియాన్ని కూడా ప్రవేశ పెట్టాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా జిల్లా కలెక్టర్‌ను కోరారు.
– మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా
– జిల్లా కలెక్టర్, డీఈఓ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారికి వినతిపత్రం
రుద్రంపూర్, జూలై 02 : ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించనున్న ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఉర్దూ మీడియాన్ని కూడా ప్రవేశ పెట్టాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 118 ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా, మండల కేంద్రాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఉర్దూ మీడియం ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. తెలంగాణలో ఉర్దూ రెండవ అధికార భాషగా ఉన్నప్పటికీ, కాలక్రమేణా దాని వినియోగం తగ్గిపోతోందని పేర్కొన్నారు.
చిన్నారులకు ప్రాథమిక దశ నుంచే ఉర్దూ మాధ్యమంలో విద్యను అందించడం ద్వారా భాష పరిరక్షణతో పాటు అభివృద్ధికి కూడా తోడ్పాటు అందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఉర్దూ మీడియం విద్య అందుబాటులోకి వస్తే మైనారిటీ విద్యార్థులు తమ మాతృభాషలో విద్యాభ్యాసం ప్రారంభించే అవకాశం లభిస్తుందని, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారికి వినతిపత్రాలు సమర్పించినట్లు యాకూబ్ పాషా వెల్లడించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

