చుంచుపల్లి, ఆగస్టు 09 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీమ్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాలర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కాకతీయులపై సమ్మక్క, సారలమ్మల వీరోచిత తిరుగుబాటు, ఆంగ్లేయులపై బిర్సా ముండా ఉద్యమాలను ఆదర్శంగా తీసుకుని ఆదివాసీల హక్కుల సాధనకై ఐక్యపోరాట కార్యాచరణ చేసి సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు పోడియం బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూణెo శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తాటి.పద్మ, నాగమణి, అనిత, శోభారాణి, కుమారి, రాములమ్మ, ఏఈడబ్ల్యూసీఏ నాయకులు తెల్లం వెంకటేశ్వర్లు, జేజే రాంబాబు, పెండకట్ల కృష్ణయ్య, పోలెబోయిన వెంకటేశ్వర్లు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పూణెo నర్సయ్య, చుంచు జగన్, తాటి తిరుమల్, తాటి అశోక్, కుంజ హైమవతి, ఆర్టీసీ ఆదివాసీ ఉద్యోగులు సూరిబాబు, సారయ్య, చింత రాములు, శ్రీనివాస్, కొమరం భీమ్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.