రామవరం, సెప్టెంబర్ 05 : రుద్రంపూర్‌లో కొత్తగా నిర్మించిన ఏఐటీయూసీ కార్యాలయం యూనియన్ (మనుబోతుల) కొమురయ్య భవన్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని బావుల డిపార్ట్మెంట్లలో యూనియన్ కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి కార్మికులు ఘన నివాళులర్పించారు. కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కూనంనేని పాల్గొని మాట్లాడారు. అమరజీవి యూనియన్ కొమురయ్య కార్మిక వర్గానికి చేసిన సేవలను కొనియాడారు. మనుబోతుల కొమురయ్య శ్రమ దోపిడీకి గురవుతున్న సింగరేణి బొగ్గు గని కార్మికుల దీన పరిస్థితిని చూసి చలించిపోయినట్లు తెలిపారు. కొమురయ్య ఒక్క పిలుపు ఇస్తే బొగ్గుబాయిల నుండి ఒక్క బొగ్గు పెల్ల కూడా బయటకు రాకుండా కార్మికులు సమ్మె చేసి సమస్యలను పరిష్కరించుకునేవారని అన్నారు. నిజాం పాలన విముక్తి కోసం పోరాడిన ఆయనను కాల్చివేయడానికి నిజాం సైన్యం గాలిచిందని, అయినప్పటికీ తన జీవితమంతా కార్మిక వర్గ పోరాటాలు చేస్తూ బొగ్గు గని కార్మికుల హక్కుల కోసం ధారపోసిన మహా నాయకుడు కొమురయ్య అని ఎమ్మెల్యే కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్, జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణ మూర్తి, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరాస్వామి, బ్రాంచ్ సహాయ కార్యదర్శి గట్టయ్య, సత్తుపల్లి బ్రాంచ్ కార్యదర్శి సుధాకర్,కొత్తగూడెం వైస్ ప్రెసిడెంట్ కతర్ల రాములు, శేషగిరి రావు, సందేబోయిన శ్రీనివాస్, ఎస్.నాగేశ్వర రావు, గుమ్మడి వీరయ్య, హీరాలాల్, పీవీకే పిట్ కార్యదర్శి హుమాయూన్, వర్క్‌షాప్ పిట్ కార్యదర్శి మధు కృష్ణ, ఏరియా స్టోర్ పిట్ కార్యదర్శి శ్రీనివాస్ కమల్, జీకేఓసీ ఇన్‌ఛార్జి పిట్ కార్యదర్శి ఎం.ఆర్.కే. ప్రసాద్, ఆర్‌సీహెచ్‌పీ సహాయ పిట్ కార్యదర్శి సురేందర్ తదితర కార్మిక సంఘం నాయకులు, సత్తుపల్లి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమయ్య, నాయకులు బ్రాంచ్ సహాయ నాయకులు సూర్యప్రకాశ్, జాయింట్ కార్యదర్శి భరణి, జె వి ఆర్ ఒక పిట్ కార్యదర్శి నరసింహ రావు, కిష్టారం ఓసీ పిట్ కార్యదర్శి కిషోర్ కుమార్, కార్మికులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.
Ramavaram : రుద్రంపూర్‌లో యూనియన్ కొమురయ్య భవన్ ప్రారంభం