ఇల్లెందు, ఏప్రిల్ 17 : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఇల్లందు డీఎస్పీ ఎన్.చంద్రభాను అన్నారు. గురువారం సాయంత్రం ఇల్లందు పట్టణ సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానక గోవిందు సెంటర్లో ఎస్ఐలు సూర్యం, హసీనా ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పాల్గొని వాహనదారులకు హెల్మెట్ పైన అవగాహన కల్పించారు. అతివేగంగా వాహనాలు నడుపొద్దని, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని అలాగే లైసెన్స్ లేకుండా, పత్రాలు లేకుండా వాహనాలు నడుపొద్దన్నారు. అటువంటి వారిపై కఠన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. మాదకద్రవ్యాలు, గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలను సేవించరాదని యువతకు సూచించారు.