పాల్వంచ నవంబర్ 23 : టీఎస్ యుటిఎఫ్ పాల్వంచ మండల అధ్యక్ష కార్యదర్శులుగా ఎం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా జి.హరి సింగ్ లను ఎన్నుకున్నారు. ఆదివారం పాత పాల్వంచలో జరిగిన ఆ సంఘం మండల శాఖ మహాసభ మండల అధ్యక్షుడు ఏ విజయభాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ఎన్నికల అధికారిగా జిల్లా కోశాధికారి ఎస్ వెంకటేశ్వర్లు, అబ్జర్వర్లుగా రాష్ట్ర కార్యదర్శి బి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు వ్యవహరించారు.
మండల నూతన కమిటీ మండల అధ్యక్షుడిగా ఎం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా జి హరి సింగ్, ఉపాధ్యక్షులుగా ఏ విజయభాస్కర్, పి సత్య శ్రీ, కోశాధికారిగా ఎం రాజు, కార్యదర్శులుగా బి అంబ్రికా జాదవ్, బి శ్రీనివాసరావు, ఎస్ యశోద, వి సోమ్లా, ఈ సమ్మయ్య, కే బాబురావు, ఈ వెంకటేశ్వర్లు, టీ బాలు, ఎస్ కోటేశ్వరరావు, ఈ జీవన్, ప్రేమ్ కుమార్, నాగేంద్ర ప్రసాద్ మండల ఆడిటర్ గా టి వెంకన్న, ప్రాంతీయ కార్యాలయ కన్వీనర్ గా వి టి ఆర్ మోహన్ రావు, మహిళా సబ్ కమిటీ కన్వీనర్ గా కే సువర్చల, సభ్యులుగా హబీబున్నీసా, అంజని, అస్మా, సుధారాణి, నాగమణి, సాంస్కృతిక కమిటీ కన్వీనర్ గా పి. రాంబాబు ఎన్నికయ్యారు. ఈ మహాసభలో నాగమణి, బి జానకి రాములు, డీ జోగయ్య, ఎం మల్లికార్జునరావు, వై గోవిందరావు, ఆర్ సురేష్ బాబు, బి. ఈరు, బి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.