నంబర్ లేకుండా దూసుకెళ్తున్నారు..
జిల్లాలో కొందరు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతుండగా, మరికొందరు ప్రమాదాలకు కారకులవుతున్నారు. తమ వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండానే యథేచ్ఛగా నడుపుతున్నారు. ట్రాఫిక్ పోలీసులకు కనిపించకుండా దూసుకెళ్తున్నారు. నిత్యం ఇలా ఎంతో మంది నంబర్‌ప్లేట్ లేకుండా నగరంలో తిరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.
- నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులు
- బైక్‌లకు కనిపించని నంబర్ ప్లేట్లు
- పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
- ప్రమాదం జరిగితే బాధ్యులను గుర్తించడంలో ఇబ్బందులు
జిల్లాలో కొందరు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతుండగా, మరికొందరు ప్రమాదాలకు కారకులవుతున్నారు. తమ వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండానే యథేచ్ఛగా నడుపుతున్నారు. ట్రాఫిక్ పోలీసులకు కనిపించకుండా దూసుకెళ్తున్నారు. నిత్యం ఇలా ఎంతో మంది నంబర్‌ప్లేట్ లేకుండా నగరంలో తిరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. ముఖ్యంగా రాత్రివేళనైతే కొంతమంది యువకులు నంబర్‌ప్లేట్ లేకుండానే ద్విచక్రవాహనాలను నడుపుతుండడం గమనార్హం.
-వినాయక్‌నగర్, ఫిబ్రవరి 14
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలులోకి తెచ్చారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల ప్రాంతంలో ఈ నిబంధన కచ్చితంగా అమలుచేయాలని పోలీస్ బాస్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయలో ఎక్కువ శాతం వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతోనే ప్రాణనష్టం జరిగినట్లు ఓ సర్వేలో వెల్లడయ్యింది. దీంతో హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలుచేస్తున్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి ట్యాబ్‌లు, సెల్‌ఫోన్స్‌తో ఫొటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్ నిబంధనను పకడ్బందీగా అమలుచేస్తున్న పోలీసులు.. నంబర్‌లేని వాహనాల వైపు ఎందుకు చూడడం లేదనే చర్చ జరుగుతున్నది. కొంతమంది వాహనదారులు.. పోలీసులు తమ బైక్ నంబర్ ఫొటో తీసి ఎక్కడ ఫైన్ విధిస్తారో అనే భయంతో తమ వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండానే నడుపుతున్నారు. మరి కొంత మంది వాహనదారులు తమ వాహనాలకు అసలు ఆర్టీఏ రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా దర్జాగా తిరుగుతున్నారు.
ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు!
కొంత కాలంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనాలు, లూఠీలు, చైన్‌స్నాచింగ్ ఘటనలకు పాల్పడిన నిందితులు ఎక్కడ కూడా తమ వాహనాలకు నంబర్‌ప్లేట్ లేకుండా జాగ్రత పడ్డారు. ఇంకొన్ని సందర్భాల్లో దాడులు జరిగినా లేదా ఘర్షణలు చోటుచేసుకున్నా తమ వివరాలు తెలియకుండా ఉండేందుకు తమ వాహనాలకు నంబర్ప్లేట్లను తొలగించుకుంటున్నారు. ఇలాంటి వారిని గుర్తించి, వారి ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసు సైతం తలలు పట్టుకోవాల్సిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నంబర్ లేని వాహనాల వివరాలను ఆర్టీఏ అధికారులకు అందిస్తున్నాం..
నంబర్ లేని వాహనాల గుర్తింపు కోసం తనిఖీలు నిర్వహిస్తున్నాం. అలాంటి వాహనాలను గుర్తించి ఆర్టీఏ అధికారులకు వివరాలను పంపిస్తున్నాం. మేము కేవలం రూ.5 వందల నుంచి వేయి మాత్రమే ఫైన్ వేసి వదిలి పెడుతున్నాం. కానీ ఆర్టీఏ అధికారులు వాహనానికి సంబంధించి ఇన్సురెన్స్, రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి రూ. 4 వేల నుంచి రూ. 5వేల వరకు జరిమానా విధిస్తున్నారు. ప్రతి వాహనదారుడు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
-మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఏసీపీ
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

