ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఓట్ల శాతం భారీగా పెంచుకొని ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడని అనేందుకు వచ్చిన ఓట్లే ఇందుకు నిదర్శనం. మహబూబ్‌గర్ కార్పొరేషన్‌తో పాటు 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించగా మొత్తం 4, 55,346 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో బీఆర్ఎస్కు 1,34,748ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లతో పరిశీలిస్తే బీఆర్ఎస్కు 29.59శాతం ఓటింగ్ శాతం నమోదైంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి 1,34,748 ఓట్లు రాగా ఓటింగ్ శాతం 41.17శాతంగా ఉంది. ఇక బీజేపీకి 73,992లో ఓట్లు రాగా 16.24శాతం ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్రులు, తిరుగుబాటు అభ్యర్థులకు 56,825ఓట్లు రాగా 12.47 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. మున్సిపాలిటీల వారీగా చూస్తే.. గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులకు 48,679 ఓట్లు పోలయ్యాయి.
బీఆర్ఎస్కు 13,809 (28.36 శాతం), కాంగ్రెస్‌కు 20,814 (42.75శాతం), బీజేపీకి 9,477 (19.46 శాతం) వచ్చాయి. అలంపూర్ బల్దియాలో 10 వార్డులకుగానూ 7,030 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్కు 3,130 (44.52 శాతం), కాంగ్రెస్‌కు 3,436(48.87 శాతం), బీజేపీకి 299 (4.2 శాతం), ఇతరులకు 165 (2.3 శాతం), అయిజలో 20 వార్డులు ఉండగా.. 19,492 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్కు 10,397 (53.33 శాతం), కాంగ్రెస్‌కు 8,265(42.04 శాతం), బీజేపీకి 361(1.85 శాతం), ఇతరులు 151 (0.77), వడ్డేపల్లిలో 10 వార్డులు ఉండగా.. పోలైన ఓట్లు 8,935.. బీఆర్ఎస్కు 2,977 (33.32 శాతం), కాంగ్రెస్‌కు 2,085 (23.33 శాతం), బీజేపీకి 56 (0.62 శాతం), ఇతరులు 3,704 (41.45 శాతం), అలాగే నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 24 వార్డులకుగానూ 26,151 ఓట్లు పోలయ్యాయి.
బీఆర్ఎస్కు 9,604 (36.72 శాతం), కాంగ్రెస్‌కు 12,728 (48.67 శాతం), బీజేపీకి 1,578 (6.03 శాతం), కొల్లాపూర్‌లో 19 వార్డులు ఉండగా.. 15,505 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్కు (34.25 శాతం), కాంగ్రెస్‌కు 9,236 (57 శాతం), బీజేపీకి 837 (5.40 శాతం), ఇతరులకు 67 (0.43 శాతం), కల్వకుర్తి పురంలో 22 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్కు 6249(30.01 శాతం), కాంగ్రెస్ 9,247 (44.04 శాతం), బీజేపీకి 4,156 (19.90 శాతం), ఇతరులు 1171 (5.06 శాతం) నమోదయ్యాయి. అలాగే మక్తల్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా.. పోలైన ఓట్లు 15,369 ఉండగా.. బీఆర్ఎస్కు 2174 (14.14 శాతం), కాంగ్రెస్‌కు 7323 (47.64 శాతం), బీజేపీకి 4,680 (30.45 శాతం), ఇతరులు 650 (4.22 శాతం), పెబ్బేరులో 12 వార్డులు ఉండగా.. 12,796 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్కు 4,577 (35.77 శాతం), కాంగ్రెస్‌కు 5,075 (39.66 శాతం), బీజేపీకి 1,582 (12.36 శాతం), ఆత్మకూరులో 10 వార్డులు ఉండగా.. 8911 ఓట్లు పోలయ్యాయి.
బీఆర్ఎస్కు 2237 (25.10 శాతం), కాంగ్రెస్‌కు 4118 (46.21 శాతం), బీజేపీకి 2349 (26.36 శాతం), ఇతరులు 207 ఉన్నారు. దేవరకద్రలో 12 వార్డులు ఉండగా.. 8,611 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్కు 2,808 (32.60 శాతం), కాంగ్రెస్‌కు 3,604 (41.85 శాతం), బీజేపీకి 1,571 (18.24 శాతం), ఇతరులు 614, భూత్పూరులో 10 వార్డులు ఉండగా.. 10,204 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్కు 2896 (28.38 శాతం), కాంగ్రెస్‌కు 4428 (43.39 శాతం), బీజేపీకి 2031 (19.90 శాతం), అమరచింతలో 10 వార్డులు ఉండగా.. 7645 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్కు 2375 (31.07 శాతం), కాంగ్రెస్‌కు 1919 (25.01 శాతం), బీజేపీకి 2005 (26.23 శాతం), ఇతరులు 1286, మద్దూరులో 16 వార్డులు ఉండగా.. 10,034 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్కు 3240 (32 శాతం), కాంగ్రెస్‌కు 5008 (49 శాతం), బీజేపీకి 877 (8 శాతం), ఇతరులు 781 (7 శాతం), కోస్గిలో 16 వార్డులు ఉండగా.. 15,219 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్కు 3204 (21 శాతం), కాంగ్రెస్‌కు 9226 (60 శాతం), బీజేపీకి 1690 (11 శాతం), ఇతరులు 829 (5 శాతం), నారాయణపేటలో 24 వార్డులకు 26,304 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్కు 5314 (20 శాతం), కాంగ్రెస్‌కు 8377 (31 శాతం), బీజేపీకి 8730 (33 శాతం), ఇతరులు 2486 (9 శాతం) నమోదయ్యాయి.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేవలం రెండేళ్లలో ప్రజా వ్యతిరేకతను ఈస్థాయిలో మూటగట్టుకున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేదు. బీజేపీ మాత్రం ఒక స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్కు రెండు మున్సిపాలిటీలు.. మరొకటి పొత్తులో దక్కింది. గద్వాలలో కూడా అధికార పార్టీకి జనం చుక్కలు చూపించినా అధికా రాన్ని అడ్డం పెట్టుకొని స్వతంత్రులను బలవంతంగా ఎత్తుకెళ్లి.. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థిని రీకౌంటింగ్‌లో ఓడించి హస్తగతం చేసుకు న్నారు. ఇదంతా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే డైరెక్షన్లోనే జరగడం గమనార్హం.