దుమ్ముగూడెం: మండలంలో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ (ఏటీఏ) మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వాసం ఆదినారాయణ, పూనెం రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వనమోదు కార్యక్రమాన్నిచేపట్టారు. మండల పరిధిలోని రామచంద్రునిపేట, కొత్తపల్లి, ఆర్లగూడెం, దుమ్ముగూడెం తదితర పాఠశాలల్లో ఉపాధ్యాయుల నుంచి సభ్యత్వనమోదు స్వీకరించారు. నర్సాపురం పాఠశాలలో ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి జయబాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ,ఉపాధ్యాయ,ఉపాధి అవకాశాల కోసం చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్నికోరారు.
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని, ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బట్టా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సోయం నాగేశ్వరరావు, మట్టా వెంకటేశ్వర్లు, వర్సా వసంతరావు, కారం గాంధీ, గట్టుపల్లి వెంకటరాంప్రసాద్, ఉషారాణి, కాకా కృష్ణవేణి, నాగమణి, సరస్వతి, కృష్ణ, సీత తదితరులు పాల్గొన్నారు.