టేకులపల్లి, ఫిబ్రవరి 04 : అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను టేకులపల్లి మండలంలోని బోడు పోలీసులు బుధవారం పట్టుకున్నారు. బోడు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… టేకులపల్లి మండలంలోని బోడు పోలీస్ స్టేషన్ పరిధి సంపత్ నగర్ సమీపంలో అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్లను టేకులపల్లి తాసీల్దార్ లంకపల్లి వీరభద్రంకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.