రామవరం, ఏప్రిల్ 24 : పహల్గాం ఉగ్రదాడి దోషులను కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా అన్నారు. దాడి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన స్పందిస్తూ.. మృతుల కుటుబాలకు సంతాపం తెలిపారు. ఇంటెలిజెన్స్ విభాగాల నిర్లక్ష్యం కారణంగానే గతంలో పుల్వామా, నేడు పహల్గాం దాడులు జరిగాయన్నారు. ఈ దాడులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు.
ఈ ఘటనలో 26 మంది మరణించడం బాధాకరమన్నారు. ఉగ్రవాదులు హిందూ-ముస్లిం అనే బేధభావం లేకుండా కాల్పులు జరిపారని, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అనే ముస్లిం ప్రాణాలను కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఉగ్ర చర్యలను యావత్ భారత సమాజం తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.