పాల్వంచ, డిసెంబర్ 31 : తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ – 1535 కార్మిక సంఘం క్యాలెండర్ను పాల్వంచలోని కేటీపీఎస్ కాలనీలో గల ఆ సంఘ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. తెలంగాణలోని విద్యుత్ రంగంలో గల జెన్కో, ట్రాన్స్కో నాలుగు కంపెనీల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు అన్ని కర్మాగారాల్లో ఆ సంఘం ఆధ్వర్యంలో ఏకకాలంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేపట్టారు. కేటీపీఎస్ లో కూడా అదే సమయానికి క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జెన్కో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.రాము, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డి.రాధాకృష్ణ, రాష్ట్ర నాయకులు పుట్టా నాగేశ్వరావు, జెన్కో అధ్యక్షుడు ఎం.శ్రీధర్, రాష్ట్ర నాయకులు అంబాల శీను, కుక్కల సాంబయ్య, రాంబాబు, ఎం.నరసింహారెడ్డి, రమేశ్, ధనయ్య పాల్గొన్నారు.