బూర్గంపహాడ్, జూన్ 02 : బూర్గంపహాడ్ మండలంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. మండల వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులతో పాటు తాసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్ బి, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో అధికారులు జెండా ఆవిష్కరణలు చేసి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. తొలుత బూర్గంపహాడ్ అంబేద్కర్ సెంటర్లో ఉద్యమకారులు ఆవిర్భావ వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు.
సారపాకలో తెలంగాణ తొలిమలిదశ ఉద్యమకారులు పొడియం నరేందర్, మర్రి సాంబారెడ్డి, పారుపల్లి శ్రీనివాస్, తోడేటి సత్యనారాయణ, ప్రసాద్, కాసర్ల దామోదరరెడ్డి, కృష్ణకుమార్, శ్రీపాద రవికుమార్, మోహనరావు, దాసరి సాంబ, నల్లమోతు సురేష్లను సర్పంచ్ కిషోర్నాయక్ సన్మానించారు. బ్రిలియంట్, ప్రగతి విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో, మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ మండల నాయకులు కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. మండలంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంఈఓ యదుసింహరాజు, ఈజీఎస్ ఏపీఓ విజయలక్ష్మి, పంచాయతీ సర్పంచులు, ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.