రామవరం, సెప్టెంబర్ 26 : బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు ప్రతీక. తెలంగాణకే సొంతమైన పూల పండుగ. అందరిలో ఐక్యతను పెంపొందించే ఈ పండుగను ప్రతి ఒక్కరూ గౌరవంగా జరుపుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని జనరల్ మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాలెం రాజు, ,విశిష్ట అతిథిగా సేవా అధ్యక్షురాలు మధురవాణి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న జరిగే ఫ్యామిలీ డే, బతుకమ్మ వేడుకలో బతుకమ్మలను పేర్చుకొచ్చిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ అలాగే 10 కన్సోలేషన్ బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మజా కోటిరెడ్డి, లేడీస్ క్లబ్ సభ్యులు పద్మావతి సూర్యనారాయణ రాజు, సేవా సెక్రటరీ వై.అనిత, జీఎం కార్యాలయ మహిళా ఉద్యోగినులు, రెస్క్ స్టేషన్ లో నివాసముంటున్న ఉద్యోగుల మహిళా కుటుంబ సభ్యులు, ఇతర సేవా సభ్యులు పాల్గొన్నారు.