సీపీఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయుల నిరసన
కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం...
జూలూరుపాడు, సెప్టెంబర్ 01 : కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సీపీఎస్ అంతం – ఉద్యోగుల పంతం నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో తమ నిరసన గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల మండల, జిల్లా టీజీఈ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రజా ప్రభుత్వంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలని, నూతన వేతన సవరణ సంఘం పీఆర్సీ నివేదికను ప్రకటించి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ జిల్లా నాయకుడు బోడ కృష్ణతో పాటు పీఆర్టీయూ, యూటీఎఫ్, టీటీఎఫ్ మండల బాధ్యులు, ఉపాధ్యాయులు ఉమ, శాంతకుమారి, వెంకటేశ్వర్లు, జీవీఆర్ ప్రసాద్, అరుణకుమారి, లలిత, సునీత, సావిత్రి, ఉపేంద్రమ్మ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

