కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 17 : గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం అభివృద్ధికి నాంది పలుకుతున్నట్టుగా ఉంటుందని, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో
స్వచ్ఛతా హి సేవా– 2025 పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు పలు స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ సిబ్బంది, యువత, ఎస్‌హెచ్‌జీ మహిళలు, విద్యార్ధుల భాగస్వామ్యంతో నిర్వహించిన కార్యక్రమాల రోజు వారి నివేదికలు, ఫొటోలు ప్రతిరోజు సాయంత్రం 5.00 గంటల లోగా ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.