రుద్రంపూర్, జూన్ 27 : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ ఎం.రాజేందర్ ఆదేశాల మేరకు కొత్తగూడెంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మాదకద్రవ్యాల (యాంటీ డ్రగ్స్) నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానల్ అడ్వకేట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. అలాగే పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, చైల్డ్ హెల్ప్‌లైన్–1098 టోల్‌ఫ్రీ సేవలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని పారాలీగల్ వాలంటీర్లు పల్నాటి శ్రీవీణా రాణి, పల్నాటి ప్రశాంత్, తులసి, జి.భవాని, ఇసన్నపల్లి నాగరాజు నిర్వహించారు. చైల్డ్ హెల్ప్‌లైన్–1098 ప్రతినిధులు సారిక, భవాని, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.