-10వ రోజుకు చేరిన కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ రిలే దీక్షలు
బూర్గంపహాడ్, ఏప్రిల్ 04 : కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను సాధించేంత వరకు ఐటీసీ యాజమాన్యంతో నిరసన పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్‌పాషా అన్నారు. శనివారం రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరుకోవడంతో దీక్షల్లో చుక్కపల్లి సుభాస్కరరావు, వల్లంకొండ సత్యం, దారావత్ రమేష్, దాసరి రాంబాబు, యారం రాజశేఖరరెడ్డి, మనూరి రామకృష్ణ, దాసరి ప్రశాంత్, కొమెరెల్లి సతీష్‌లు పాల్గొని తమ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ 13వ వేతన ఒప్పంద కాలంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని, 14వ వేతన ఒప్పందాన్ని జేఏసీతో కలిసి చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై ఐటీసీ యాజమాన్యం దిగొచ్చేంత వరకు పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు మర్రి వెంకటరెడ్డి, బత్తుల గోపాలరావు, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, అక్కాని సర్వేశ్వరరావు, సూరిశెట్టి జగదీష్, కోడి శ్రీను, గుప్తా ఉదయ్ పాల్గొన్నారు.