హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 18: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ ఎస్)లో ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ 13 అట్టహాసం గా ప్రారంభమైంది. ఒకరోజు నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో 495 మంది అథ్లెట్లు, 200 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొన్నారు. 100మీ, 200మీ, 400మీ, 800మీ, 1500 మీటర్ల పరుగుపందెంతో పాటు జావెలిన్ త్రో, లాంగ్‌జంప్, హైజం ప్, ట్రిపుల్ జంప్, షాట్ పుట్, 110మీ హార్డిల్స్, 110మీ హార్డిల్స్, 400 మీటర్ల హీర్డిల్స్ 13 క్రీడాంశాల్లో మెన్ అండ్ ఉమెన్ అథ్లెట్లకు వేర్వేరుగా పోటీ లు నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు, అర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఇండియ న్ పోలీస్, రైల్వేస్, స్పోర్ట్స్ బోర్డు క్రీడాకారులు పా ల్గొని ప్రతిభ కనబరిచారు.
ఏషియన్గేమ్స్కు ఇది లాస్ట్ సెలక్షన్స్ అని, ప్రభుత్వ సహకారం లేకపోవడంలో అన్ని ఏర్పాట్లు కల్పించలేకపోయామని రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొదురుపాక సారంగపాణి తెలిపారు. రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాన్లీ జోన్స్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అథ్లెటి క్స్ అసోసియేషన్ చైర్మన్ వరద రాజేశ్వర్‌రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మ న్, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకుడు గట్టు మహేశ్‌బాబు, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, ఐలి చంద్రమోహన్‌గౌడ్, యుగేంధర్‌రెడ్డి, గంగిశెట్టి మనోజ్‌కుమార్, ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా కార్యద ర్శి వరికోట వాసుదేవరావు పాల్గొన్నారు.