రామవరం, జనవరి 05 : రాష్ట్ర స్థాయి నిపుణుల అప్రైజల్ కమిటీ సభ్యులు సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి గనిలో అండర్‌గ్రౌండ్ (UG) బొగ్గు గనికి మంజూరైన పర్యావరణ అనుమతుల (EC Conditions) అమలును పరిశీలించుటకు సోమవారం గనిని సందర్శించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు ఎస్‌ఈఏసీ బృందం వారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం వారు పద్మావతి ఖని మేనేజర్ కార్యాలయంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. పద్మావతి ఖని మేనేజర్ బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వివరించారు. అనంతరం వారు అండర్ గ్రౌండ్ నందు బొగ్గు ఉత్పత్తి చేయు పని ప్రదేశాలను సందర్శించారు. ఆ తర్వాత పద్మావతి ఖని నందు ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ (ఎన్విరాన్మెంట్) బి.సైదులు, రాష్ట్ర స్థాయి నిపుణుల అప్రైజల్ కమిటీ సభ్యులు డా.ఎ. వెంకట రాజశేఖర్, డా.సరిత సజ్జ, దినేశ్ కుమార్, భరద్వాజ్, ఎస్ఓటు జిఎం జీ.వి.కోటిరెడ్డి, సిహెచ్.అజాయే, పీసీబీ (స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు), పద్మావతి ఖని ఏజెంట్ రామ్ భరోస్ మహాతో, మేనేజర్ డా.ఎం.వి.ఎన్ శ్యామ్ ప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Ramavaram : కొత్తగూడెం ఏరియాను సందర్శించిన రాష్ట్ర స్థాయి నిపుణుల అప్రైజల్ కమిటీ