రామవరం, జూన్ 18 : కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్లో నూతన పిట్ కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. సివిల్ పిట్ కార్యదర్శిగా సందబోయిన శ్రీనివాస్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శులుగా జి.అప్పారావు, సలిగంటి వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీగా టి.నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా ఎం.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా జె.ప్రకాశ్, ఎస్.శివకుమార్, అడ్వైజర్‌గా కె.రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. నూతన పిట్ కమిటీని సీపీఐ పార్టీ అనుబంధ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున్ సివిల్ డిపార్ట్మెంట్ హెచ్.ఓ.డి ఏజీఎం (సివిల్) రామకృష్ణకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా వట్టికొండ మల్లికార్జున్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారంలో పిట్ కమిటీలు ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు. ఉత్పత్తి, ఉత్పాదక సజావుగా జరగడానికి కార్మిక సంఘ నాయకులు ముఖ్యపాత్ర పోషిస్తారని తెలిపారు. అదేవిధంగా సివిల్ డిపార్ట్మెంట్లో గుర్తింపు సంఘం పిట్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక సమస్యలు యాజమాన్యంతో నిరంతరం చర్చిస్తూ పరిష్కరిస్తామని పిట్ కమిటీ సభ్యులు తెలిపారు.
అనంతరం సివిల్ డిపార్ట్మెంట్ హెచ్.ఓ.డి రామకృష్ణకి పిట్ కమిటీల పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజ్ సెక్రటరీ జి.వీరాస్వామి, సహాయ కార్యదర్శి గట్టయ్య, సత్తుపల్లి కార్యదర్శి సుధాకర్, ఆఫీస్ బెర్రర్స్, ఎస్.నాగేశ్వరరావు, మండల రాజేశ్వరరావు, గుమ్మడి వీరయ్య, హీరాలాల్, ట్రేడ్స్ మెన్ కమిటీ అధ్యక్షుడు ఆర్.సాంబమూర్తి, ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి శ్రీనివాస్ (కమల్), సివిల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు.