చుంచుపల్లి, జనవరి 20 : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని చుంచుపల్లి మండలం విద్యానగర్ సర్పంచ్ భుక్యా శాంతి శ్రీ అన్నారు. మంగళవారం విద్యానగర్ పరిధిలో గల సెయింట్ జేవియర్ స్కూల్లో సీఎం కప్ క్రీడా పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుభాషిని, తాసీల్దార్ పి.కృష్ణ, బాబు క్యాంప్ గ్రామ సర్పంచ్ నునావత్ కుమారి, విద్యానగర్ ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.