చండ్రుగొండ: చందుగొండ మండల పరిధిలోని రేపల్లెవాడ అభయాంజనేయ ఆలయంలో అయ్యప్పభక్తులు ఇరుముడి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గ్రామస్తులు , మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప నామస్మరణతో ఆలయం ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై బి.రాజేష్‌కుమార్, ఎంపీపీ బానోత్ పార్వతి, సర్పంచ్ కాక శ్రీను, టిఆర్ఎస్ మండల అద్యక్షులు దారాబాబు, ప్రధాన కార్యదర్సి ఉప్పతల ఏడుకొండలు, సీనియర్ నాయకులు దారా రత్నాకర్,సూర వెంకటేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు,వెంకటేశ్వర్లు, మార్తి సత్యనారాయణ,బానోత్ రాముడు, తదితరులు పాల్గొన్నారు.