కొత్తగూడెం అర్బన్, జూన్ 09 : సీతారామ ప్రాజెక్ట్ జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతాంగానికి అందించాలని కొత్తగూడెం మున్సిపల్ తాజా మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ పిలుపులో భాగంగా సోమవారం కొత్తగూడెం తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాసీల్దార్ దొడ్డి పుల్లయ్యకు అందజేసి మాట్లాడారు. జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను జిల్లా రైతాంగానికి అందించాలని, ముగ్గురు మంత్రులు ఉండి స్థానిక రైతాంగానికి సాగునీరు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. జిల్లా రైతులకు సాగునీరు ఇచ్చాకే ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలన్నారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కాక వాటిని గాలికి వదిలేసినట్లు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా పార్టీ తరపున ప్రజల పక్షాన నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కాన్సిలర్ వేముల ప్రసాద్ బాబు, మాజీ కౌన్సిలర్ తొగరు రాజశేఖర్, మాజీ మండల అధ్యక్షుడు హుస్సేన్, జయరాం, మాజీ సర్పంచ్ గుమ్మడి సాగర్, మైనారిటీ సెల్ నాయకులు ఖాజా భక్ష్, ఎస్సీ సెల్ నాయకుడు రావెళ్ల మధు, ఎస్టీ సెల్ నాయకులు పూర్ణచందర్, రేణిగుంట్ల రాంబాబు, సూరిబాబు, రాచపల్లి శ్రీనివాస్, సుందర్ పాసి, నిజాం, కిమ్, తలుగు అశోక్, ఎండీ రషీద్, ప్రశాంత్, చంద్రశేఖర్, మహిళా నాయకులు ఎండీ రెహనా సుల్తానా, శైలజ, సంధ్య, జ్యోతి, మాధవి, ఎండీ ఖతీజ, నందిని, కళావతి, వెన్నెల, కాత్యాయని, కార్యకర్తలు పాల్గొన్నారు.