కోల్ సిటీ, జూలై 21 : పుట్టిన రోజున బంధువులు, స్నేహితులను ఇంటికి పిలిచి కేక్‌లు కట్ చేసి విందులు, వినోదాలతో ఆడంబరంగా జరుపుకుంటారు చాలామంది. కానీ గోదావరి ఖనికి చెందిన సింగరేణి కార్మికుడు మాత్రం తన పుట్టిన రోజును అనాథ పిల్లల మధ్య జరుపుకున్నాడు. సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక గాంధీనగర్‌లో గల ఎండీహెచ్‌డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్రానికి చేరుకుని వారి మధ్య జన్మదిన వేడుకను జరుపుకున్నాడు. కేక్ కట్ చేసి వారికి స్వీట్లు పంచిపెట్టాడు. అనంతరం ఒకరోజు పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టి ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య పాల్గొన్నారు.