కారు ఢీకొని సింగరేణి ఉద్యోగి మృతి
కారు ఢీకొనడంతో సింగరేణి ఉద్యోగి మృతి చెందిన దుర్ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో నివసించే రూపేష్ పాసి (36) సత్తుపల్లి కిష్టారం ఓపెన్ కాస్ట్లో..
రుద్రంపూర్, ఏప్రిల్ 30 : కారు ఢీకొనడంతో సింగరేణి ఉద్యోగి మృతి చెందిన దుర్ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో నివసించే రూపేష్ పాసి (36) సత్తుపల్లి కిష్టారం ఓపెన్ కాస్ట్లో జనరల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 11:15 గంటల సమయంలో రుద్రంపూర్ నుండి కొత్తగూడెంకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని జాతీయ రహదారిపై చండ్రుగొండ నుండి కొత్తగూడెం వైపు వెళ్తున్న TG 28 9512 నంబర్ గల కారు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూపేష్ పాసి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

