Chunchupalli : రైతు ముంగిట్లో లేని విత్తనాలు
వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన చుంచుపల్లి మండలంలోని ప్రశాంతి నగర్ రైతు వేదికలో "రైతు ముంగిట్లో విత్తన మేళా" కార్యక్రమం ఆశించిన స్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు.
చుంచుపల్లి, జూన్ 23 : వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన చుంచుపల్లి మండలంలోని ప్రశాంతి నగర్ రైతు వేదికలో “రైతు ముంగిట్లో విత్తన మేళా” కార్యక్రమం ఆశించిన స్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమం మేరకు గ్రామాల వారీగా రైతు వేదికల్లో వివిధ రకాల నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాల్సి ఉన్నప్పటికీ మండలంలోని రైతు వేదికల్లో ప్రభుత్వం ప్రకటించిన ఆ ఏడు వరి రకాలకు చెందిన విత్తనాలు లేకపోవడంతో రైతులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల వరి వంగడాల విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ద్వారా రైతులకు అందించాల్సి ఉన్నా అవి అందుబాటులో లేకపోవడం రైతుల్లో అసంతృప్తిని కలిగించింది. కార్యక్రమం ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలు లభిస్తాయని ఆశించిన రైతులు రైతు వేదికలకు చేరుకోగా నిరాశతో వెనుదిరిగారు.
కేవలం కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ద్వారా తీసుకొచ్చిన కొద్దిపాటి విత్తన సంచులను మాత్రమే కొంతమంది రైతులకు అందజేయగా, మిగతా రైతులకు విత్తనాలు అందలేదు. దీంతో ఇప్పటికే సాగు పనులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో పలువురు రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులు, పీఏసీఎస్ సీఈఓను వివరణ కోరగా చుంచుపల్లి మండలంలో విత్తనాల డీలర్లు లేరు. ప్రభుత్వం నుంచి ఇంకా విత్తనాలు అందలేదు. మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది” అని తెలిపారు. కేవలం జీరుగులు మాత్రమే అందుబాటులో ఉంచడం ఏంటని, అయితే ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన విత్తన మేళా కార్యక్రమంలో రైతులకు అవసరమైన సమయంలో విత్తనాలు అందుబాటులో లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు వేదికల్లో విత్తనాలు అందుబాటులో ఉంచుతామని ప్రకటించిన ప్రభుత్వం ఆ హామీని అమలు చేయడంలో ఎందుకు విఫలమైందని వారు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

