రామవరం, సెప్టెంబర్ 29 : సహపంక్తి భోజనాలు మనలో ఐక్యత, ప్రేమాభిమానాలను పెంపొందించడంలో దోహద పడుతాయని, సింగరేణి ప్రాంతంలో కార్మికుల ఐక్యతకు ఇవి నిదర్శనాలని కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు. దేవి నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకుని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ సివిల్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అచ్యుతరామయ్య, రాజారాం, నిఖిల్, సుమంత్, కమిటీ సభ్యులు, సివిల్ కాంట్రాక్టర్స్ గుట్టకింద శ్రీనివాస్, సాంబ శివరాజు, కృష్ణారెడ్డి, కె.కిశోర్, చిట్టి సంపత్ రెడ్డి, ఏటీఎం శ్రీనివాస్, కుంచం మల్లయ్య, పల్లపు వెంకటేశ్వర్లు, పల్లపు శ్రీనివాస్, సిరిసిల్ల రమేష్, మేఘనాదం, ఏరియా అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Ramavaram : ఐక్యత, ప్రేమాభిమానాలకు సహపంక్తి భోజనాలు దోహదం : సీహెచ్ రామకృష్ణ