రామవరం, డిసెంబర్ 08 : సింగరేణి సంస్థలో 56వ యాన్యువల్ సేఫ్టీ ఫోర్ట్‌నైట్–2025 కార్యక్రమంలో భాగంగా సోమవారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని పెనుబల్లి 37 MW సోలార్ ప్లాంట్, రామవరం 10.5 MW సోలార్ ప్లాంట్లను సేఫ్టీ ఇన్స్పెక్షన్ టీం పరిశీలించింది. ఈ ఇన్స్పెక్షన్కు సేఫ్టీ టీం కన్వీనర్ కె.శ్రీనివాసులు, జీఎం (E&M) WSs & EM నాయకత్వం వహించారు. సభ్యులుగా పి.శ్రీనివాసరెడ్డి SE(E&M) SC పాలిటెక్నిక్, పి.నాగేశ్వరరావు Dy.SE(E&M) Pur Corp, రమేశ్ బాబు WMI ఫోర్మన్ (Elec) AWS, కొత్తగూడెం పాల్గొన్నారు.
కొత్తగూడెం ఏరియా నుంచి ఏజీఎం (E&M) సూర్యనారాయణ రాజు, ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఏరియా వర్క్‌షాప్ హెచ్ఓడీ జే.క్రిస్టాఫర్, 37MW & 10.5MW సోలార్ ప్లాంట్ ఇన్చార్జి బి.శంకర్ (Dy.SE), వర్క్‌షాప్ ఇంజినీర్ టి.అనిల్, ఐఎన్టీయూసీ పిట్ కార్యదర్శి ఎండీ సత్తార్ పాషా, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి ఎం.మధు కృష్ణ పాల్గొన్నారు.
సేఫ్టీ టీం సోలార్ ప్లాంట్లలోని పవర్ జనరేషన్ విధానం, పరికరాల నిర్వహణ, ప్రతి పనిలో SOP, SMP అమలు స్థితి వంటి కీలక అంశాలను అడిగి తెలుసుకుంది. అనంతరం యంత్ర పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్లాంట్ సిబ్బందికి అవసరమైన సూచనలు, సలహాలు అందించింది. సేఫ్టీ టీం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన టెక్నీషియన్‌కు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు భాను ప్రకాశ్, వీర ఆంజనేయులు, రమణ, మౌనిక్, కిశోర్, మురళికృష్ణ, టెక్నీషియన్లు శివరాం, రాజశేఖర్, సాయికిరణ్, కనకరాజు, దినకర్, విలియం, శేఖర్ పాల్గొన్నారు.