ప్రజా సమస్యల పరిష్కారంలో పాలక ప్రభుత్వాలు విఫలం : ఎమ్మెల్యే కూనంనేని
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..
కొత్తగూడెం గణేష్ టెంపుల్, జులై 01 : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ మాస్ లైన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎవరినైనా ప్రశ్నిస్తానన్నారు. పాలక ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కొలగొట్టేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు.
సర్ పేరుతో ఓట్లను తొలగించి తమకు అనుకూలమన్న ఓటర్లను మాత్రమే చేర్చే ప్రక్రియ చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని, జీవో నెంబర్ 76 ను పునరుద్ధరించి ఇంటి పట్టాలు మంజూరు చేయాలన్నారు. పేదల పక్షాన పోరడడానికి తాను ఎప్పుడు సిద్ధమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, ముత్యాలు, విశ్వనాథం, తుపాకుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

