పాల్వంచ, జనవరి 27 : మేడారం జాతర సందర్భంగా పాల్వంచ బస్టాండ్ నుండి మేడారం వరకు వెళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను పాల్వంచ డీఎస్సీ సతీష్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. పాల్వంచ నుండి మేడారం 150 కిలోమీటర్ల దూరానికి పెద్దలకు రూ.310, పిల్లలకు రూ.170 టికెట్ ఛార్జి. మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించ వచ్చని తెలిపారు. మేడారం వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగ చేసుకోవాలని భద్రాచలం డిపో మేనేజర్ జంగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర డిపో మేనేజర్ రామయ్య, కొత్తగూడెం డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి, చీఫ్ ఇన్స్పెక్టర్ విజయ శ్రీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాంకుమార్, సామాజిక సేవా కార్యకర్త యడ్లపల్లి శ్రీనివాసరావు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Palvancha : పాల్వంచ నుండి మేడారానికి ఆర్టీసీ బస్సులు ప్రారంభం