పాల్వంచ, ఏప్రిల్ 15 : రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం పాల్వంచలోని కేటీపీఎస్ కాలనీలో గల పీఎం సిరి బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులతో జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పాఠశాల ఆవరణ నుండి పట్టణంలోని మార్కెట్ గుండా అంబేద్కర్ సెంటర్ బస్టాండ్ మీదుగా పాఠశాల వరకు కొనసాగింది. అనంతరం పాఠశాల ఆవరణలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రోడ్డు – భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు డీఈఓ నాగలక్ష్మి చేతుల మీదుగా బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కోఆర్డినేటర్లు ఎస్కే. సైదులు, ఎన్.సతీష్ కుమార్, హెచ్ఎం రమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.