పాల్వంచ, జూన్ 11 : పాల్వంచ పట్టణంలోని రెస్టారెంట్లు, హోటల్స్, టీ స్టాల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్, కర్రీ పాయింట్ సెంటర్లపై బుధవారం సివిల్ సప్లయ్ డిప్యూటీ తాసీల్దార్ శ్రీనివాసరావు రైడ్ చేశారు. ఈ సందర్భంగా కమర్షియల్స్ గ్యాస్ సిలిండర్లకు బదులుగా గృహ అవసరాలకు వాడే సిలిండర్లను ( డొమెస్టిక్) వాడటాన్ని గుర్తించి 35 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 12 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు హెచ్పీ గ్యాస్ కంపెనీ ఏజెన్సీ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఉన్నారు.